ఏపీ లో నేటితో ఎన్నికల ప్రచారం బంద్..
ఆంధ్రాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడనుంది. మే 13 న ఎన్నికల జరగబోతున్న నేపథ్యంలో.. ఎన్నికల సమయాన్ని కంటే 48 గంటల ముందుగా ప్రచారం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీ నాయకులు ప్రచారం ముగింపు పలకాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచార నిమిత్తం..ఇతరత్రా కారణంగా వెళ్లిన కొత్తవారు.. ఓటు లేని స్థానికేతరులు ప్రచారం ముగిసే లోగా నియోజకవర్గాలను వీడాల్సి ఉంటుంది. లేకపోతే ఎన్నికల నిబంధన ఉల్లంఘన కింద కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. గత నెల 18న మొదలైన నామినేషన్ల పర్వం 25వ తేదీ వరకు సాగింది. ఆ తర్వాత పత్రాల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసింది.
ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఫైనల్ అయ్యాక పార్టీలు విస్తృత ప్రచారం మొదలు పెట్టాయి. ఓటర్లను ఆకట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేయడమే కాక ప్రత్యేకమైన మేనిఫెస్టోలోతో ఉచితాలను కూడా అందించారు. మరోపక్క ఎన్నికల కమిషన్ ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ఎన్నికలు ఎంతవరకు సజావుగా సాగుతాయో అన్న అనుమానం అధికార పార్టీలో బలంగా కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజుతో ఎన్నికల్లో ముఖ్యమైన ప్రచార ఘట్టం ముగుస్తుంది. మరి ఓటింగ్ ఘట్టం ఎటువంటి పరిణామాలకు తావిస్తుందో చూడాలి.













