టీడీపీలో పదవుల పండగ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది కార్పొరేషన్ల్నకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు, ఉర్దూ అకాడెమీ, తిరుపతి, కర్నాలు నగరాభివృద్ధి సంస్థలు సహా వివిధ కార్పొరేషన్లకు చైర్మన్‌ను నియమించారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా జలీల్‌ఖాన్, ఉర్దూ అకాడెమీ చైర్మన్‌గా ఎస్.ఎం.డి.నౌమాన్, రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్‌గా జె.ఆర్. పుష్పరాజ్, ఏపీ సినిమా, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అంబికా కృష్ణ, కర్నూలు నగరాభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ సొమిశెట్టి వెంకటేశ్వర్లు, తిరుపతి నగాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్‌గా జి.నరసింహయాదవ్, తోలు పరిశ్రమల అభివృద్ధి సంస్థ (లిడ్ క్యాప్) చైర్మన్‌గా జి.ఎరిక్సన్ బాబు, మాసం అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పి. ప్రకాశ్ నాయుడులు నియమితులయ్యారు.













