Minister Bhupathi: నరసాపురానికి వందేభారత్ తీసుకొచ్చేందుకు కృషి : కేంద్రమంత్రి భూపతిరాజు

నరసాపురానికి వందేభారత్ (Vande Bharat) తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ (Bhupathi Raju Srinivas Varma) తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సారథ్యం-చాయ్‌పే చర్చ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav) లో కలిసి పాల్గొని ఆయన స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ రైల్వే, జాతీయ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించాను. వందేభారత్ నరసాపురం (Narasapuram) వరకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అత్తిలిలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు, తాడేపల్లిగూడెంలో వందేభారత్ హాల్ట్, అరుణాచలం రైలు సర్వీసులు రెగ్యులర్ చేసేలా కృషి చేస్తున్నాను. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) జాతీయ రహదారులకు అనుమతి మంజూరు చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవేకు పచ్చజెండా ఊపారు అని తెలిపారు.