ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ వేటు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ముగ్గురు ఐఏఎస్‌లతోపాటు, ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేసింది. వీరిలో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు. ఐఏఎస్ అధికారుల్లో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా అధికారి గౌతమి, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీషా ఉన్నారు. బదిలీ అయినవారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటల్లోగా బదిలీ చేయాలని, కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.













