Amaravati :అమరావతిలో టెండర్లకు ఈసీ అనుమతి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి(Amaravati)లో నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతిచ్చింది. కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections) ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సీఆర్డీఏ (CRDA) పరిధిలో చేపట్టబోయే పనులకు అనుమతి కోసం ఇటీవల సీఆర్డీఏ అధికారులు ఈసీ (EC)కి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఈసీ, రాజధానిలో పనులకు అభ్యంతరం లేదని లేఖ ద్వారా స్పష్టం చేసింది. టెండర్లు (Tenders) పిలిచేందుకు అనుమతించింది. అయితే, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే టెండర్లు ఖరారు చేయాలని లేఖలో పేర్కొంది.













