ఏపీలో ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదల
డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 18న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువరించనుంది. జులై 6న పోలింగ్ నిర్వహించనుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు ఇచ్చింది. 26 నామినేషన్లను పరిశీలన చేపట్టనున్నారు. 29 వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. శాసనసభ కోటాలో ఈ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. జులై 6న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మార్చి 9న తన ఎమ్మెల్సీ స్థానానికి డొక్కా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన వైకాపాలో చేరారు.













