ఆ సినిమా ప్రదర్శనకు అనుమతులివ్వొద్దు
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకూ ఆంధ్రప్రదేశ్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రదర్శించేందుకు వీల్లేదని ఆ సినిమా దర్శకుడు రామ్గోపాల్ వర్మకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది సృష్టం చేశారు. ఏప్రిల్ 10న భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) జారీ చేసిన ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ఇదే అంశాన్ని ఆ సినిమా నిర్మాతలైన రాకేశ్రెడ్డి, దీప్తి బలగిరిలకు గతంలోనే చెప్పామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా ప్రదర్శనకు అనుమతివ్వాలని రామ్గోపాల్ వర్మ ఏప్రిల్ 25న ద్వివేదికి విజ్ఞప్తి చేశారు. ఆ లేఖకు స్పందించిన ద్వివేది వర్మకు లేఖ పంపించారు.













