ఎన్నికల కోడ్ ఉల్లంఘన నేపథ్యంలో నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు..
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈసీ ఎక్కడ కోడ్ ఉల్లంఘన జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలకు ఇప్పటికే నోటీసులు కూడా వెళ్లాయి. తాజాగా నారా భువనేశ్వర్ కి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి నోటీసులు అందాయి. నారా భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేస్తూ చెక్కులు పంపిణీ చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చర్యలు కూడా తీసుకోవాలని వారిని కోరారు. దీంతో ఈసీ నారా భువనేశ్వర్ కి నోటీసు జారీ చేయడంతో పాటు ఈ ఘటనపై 24 గంటలలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత మనస్థాపానికి గురి అయిన నారా భువనేశ్వరి న్యాయం గెలవాలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికి కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.













