సీఎం చంద్రబాబుకు ఈసీ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన రాసిన లేఖపై ఈసీ సానుకూలంగా స్పందించి.. ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ను మినహాయించింది. ఫణి తుపాను నేపథ్యంలో విశాఖ, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సహాయ చర్యలకు విఘాతం కలగకుండా, కోడ్ మినహాయించాలని ఈసీకి చంద్రబాబు లేఖ రాశారు. ఆయన లేఖకు సానుకూలంగా స్పందించిన ఈసీ ఈమేరకు నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ను మినహాయించింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.













