జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసే …
కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందజేశారు. ఈ ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్ చైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు అందజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేసిన విషయం విదితమే. అదే విధంగా ఈసారి ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవనున్నారు.













