Gorantla: వైసీపీ నేతలు అడ్డుకున్నా రాష్ట్రాభివృద్ధి ఆగదు : గోరంట్ల

సూపర్‌సిక్స్‌లో చెప్పినవి, చెప్పనివి కూడా అమలు చేశామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Butchaiah Chowdhury) తెలిపారు. రాజమహేంద్రవరం (Rajahmundry) లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు (Industrialists) క్యూకడుతున్నారన్నారు. ఇప్పటికే 10 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ (YCP) నేతలు అడ్డుకున్నా రాష్ట్రాభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.