ఎలక్షన్స్ కారణంగా వాయిదా పడ్డ డీఎస్సీ..
ఏపీలో ఎంతోమంది పట్టబద్రులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం, నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త నోటిఫికేషన్ రాలేదు సరికదా.. పడ్డవి కూడా వాయిదాలు పడడం వాళ్లకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ఏపీలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్రాలో ఎన్నికల నేపథం లో ఎన్నికల కమిషన్ డీఎస్సీ ను వాయిదా వేయాల్సిందిగా ఆదేశం ఇచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే ఈ పరీక్షలు నిర్వహించాలని ఈసీ ఆదేశించడంతో డీఎస్సీ పరీక్షలు జూన్ 4 తర్వాత జరగనున్నాయి. అంతేకాదు ఎన్నికల కోడ్ పూర్తి అయ్యే వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయిన టెట్ ఫలితాలను కూడా విడుదల చేయకూడదని ఈసీ పేర్కొంది.













