దేశంలోనే తొలిసారిగా.. డ్రోన్ షోకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంది. పున్నమి ఘాట్ వేదికగా జరిగిన ఈ డ్రోన్ షోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. డ్రోన్ షోకి ముందు జరిగిన లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. డ్రోన్ షో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. 5,500 డ్రోన్లతో తొలిసారిగా దేశంలోనే అతిపెద్ద షోను నిర్వహించారు. కాగా డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు డ్రోన్ షో అనంతరం సీఎం చంద్రబాబు నాయుడికి గిన్నిస్ బుక్ రికార్డు ధ్రువపత్రాలు అందించారు. గిన్నిస్ రికార్డులు అందుకున్న కంపెనీలలో లార్జెస్ట్ ప్లానెట్ ఆకృతి, నదీ తీరాన లార్జెస్ట్ ల్యాండ్ మార్క్, అతిపెద్ద జాతీయ జెండా ఆకృతి, అతిపెద్ద ఏరియల్ లోగో ఆకృతి, అతిపెద్ద విమానాకృతి.













