స్వామి సేవపై డాక్టర్ శోభారాజు గానం
తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1978లో డాక్టర్ శోభారాజు గారిని అన్నమయ్య తత్వ ప్రచారానికి తమ తోలి కళాకారిణిగా నియమించారు. తదాదిగా ఎన్నో సృజనాత్మక కార్యక్రమాలతో అన్నమ్మయ్య సంకీర్తనలకు ఎనలేని ప్రచారం కల్పిస్తూ, 1983లో వారు స్థాపించిన “అన్నమాచార్య భావన వాహిని” సంస్థ ద్వారా ఇనాటి వరకు కూడా అవిరామ కృషి చేస్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజు గారిని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానముల ఆస్ధాన గాయనిగా నియమిస్తూ సెప్టెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానముల ఆస్ధాన గాయనిగా తమ నియామకానికి స్పందిస్తూ, శోభారాజు గారు ఆసువుగా పాడిన పాట.













