డాక్టర్ రామినేని ఫౌండేషన్ అవార్డుల ప్రకటన
ఈ రోజున డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారం 2020 సంవత్సరానికి సంబంధించి పత్రికా సమావేశం విజయవాడలో హోటల్ మురళీ ఫార్చ్యూన్ నందు నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో రామినేని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్ గారు మరియు రామినేని ఫౌండేషన్ కన్వీనర్ శ్రీ పాతూరి నాగభూషణం గారు పాల్గొని విశిష్ట విశేష పురస్కారములు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ పాల్గొనడం జరిగింది విశిష్ట పురస్కారం అవార్డు గ్రహీత (1) Dr గోవిందరాజులు చింతల (నాబార్డ్ చైర్మన్) (2) ప్రత్యేక పురస్కారం శ్రీ సోను సూద్ గారు (యాక్టర్. ప్రొడ్యూసర్. సంఘ సేవకులు) (3) విశేష పురస్కారం. శ్రీమతి సుమ కనకాల గారు (టీవీ యాంకర్) (4) విశేష పురస్కారం. శ్రీ సుధాకర్ వేమూరి (బ్యాట్మెంటన్ ఎంపైర్ & రిఫరీ) (5) విశేష పురస్కారం శ్రీ బండ్లమూడి శ్రీనివాస్ గారు (వ్యవస్థాపకులు ద్వారకామాయి సేవ ట్రస్ట్ షిరిడి).













