ఆంద్రప్రదేశ్ లో డీపీ వరల్డ్ పెట్టుబడులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోర్టులు, లాజిస్టిక్ పార్కులు, పారిశ్రామిక పార్కులు నిర్వహించే దుబాయ్‌కు చెందిన డీపీ వరల్డ్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనుంది. దుబాయ్ ఎక్సోపో 2020లో భాగంగా దుబాయ్ పర్యటలో ఉన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని బృందం డీపీ వరల్డ్ అభివృద్ధి చేసిన జెబెల్ అలీ పోర్టును పరిశీలించింది. రాష్ట్రంలో కొత్తగా అభివృద్ధి చేస్తున్న నాలుగు పోర్టులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆసక్తి చూపుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎగుమతుల కోసం ఒకేసారి 10 లక్షల కార్లను నిలిపే సామర్థ్యంతో ఈ పోర్టును అభివృద్ధి చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి డీపీ వరల్డ్ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు మంత్రి మేకపాటి తెలిపారు.













