ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన డొక్కా
డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారన్నారు. అంతకు ముందు ఆయన తెలుగుదేశం నుంచి గెలిచి తర్వాత వైసీపీలో చేరారని తెలిపారు. అయితే వైసీపీలో చేరే ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారన్నారు. ఆ తర్వాత ఆయన స్థానానికి వైసీపీ మళ్లీ ఆయన్నే నిలబెట్టిందన్నారు. టీడీపీ పదవులు వదిలేసి వైసీపీ టికెట్‌పై గెలిచిన మొదటి వ్యక్తి డొక్కా అని ప్రశంసించారు. రాజీనామా చేస్తేనే పార్టీలోకి తీసుకుంటాం అని చెప్పిన మాటకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారన్నారు. తమ పార్టీ నైతిక విలువలకు ఇదే నిదర్శనం అని అంబటి సృష్టం చేశారు.













