ప్రధాని మోదీ దీనిపై తక్షణమే చర్చించాలి : మాజీ మంత్రి డొక్కా
నైతిక విలువలు లేకుండా సొంత తల్లి, చెల్లిని కోర్టు ద్వారా ఇబ్బందులు పెట్టడం చూస్తే, వైసీపీ అధినేత జగన్ చరిత్రహీనుడిగా నిలవబోతున్నారని మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో, ప్రస్తుతం ఉన్న ఆస్తులు, వాటి విలువ ఎంతో చెప్పాలని జగన్కు సూచించారు. జగన్ అక్రమ ఆస్తులపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరారు. జగన్ బరితెగింపు చూస్తే కేంద్ర ఆర్థిక సంస్థల్లో కొందరు ఆయన ద్వారా లబ్ధి పొందుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రధాని మోదీ దీనిపై తక్షణమే ప్రత్యేక చర్చలు జరిపి, చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి జగన్ ఆస్తులను జాతీయం చేయాలని కోరారు. ప్రజల ఆస్తులను అప్పనంగా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై కూటమి ప్రభుత్వం మీనవేషాలు లెక్కించడం సరికాదన్నారు.













