ప్రధాని మోదీ సభ విఫలం : డొక్కా
విశాఖలో నిన్న జరిగిన ప్రధాని మోదీ సభ విఫలమైందని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సభలో ప్రజల భక్కులను ప్రధాని ప్రస్తావించకపోవడం సరికాదన్నారు. వాల్తేరు డివిజన్‌ను కొంత రాయ్‌గఢ్‌లో, మరికొంత విజయవాడలో కలిపారని, ఆదాయం రాయ్‌గఢ్‌కు, ఖర్చు విశాఖకు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్ర విభజన తరహాలోనే అసంబద్ధంగా రైల్వేజోన్ విభజన జరిగిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు ఆర్థిక మంత్రికి, సర్జికల్ స్ట్రైక్ రక్షణమంత్రికి తెలియదని అన్నారు. ప్రధాని మోదీ నియంతృత్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు.













