మే 23న హీరో ఎవరో.. విలన్ ఎవరో తేలుతుంది
గవర్నర్ నరసింహన్ దగ్గర వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలేనని టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రనసాద్ అన్నారు. జగన్ మీడియా సమావేశంపై స్పందించిన ఆయన మాట్లాడూతూ మే 23న హీరో ఎవరో, విలన్ ఎవరో తేలుతుందన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలే గొడవలు చేసి వాళ్లు గవర్నర్కు ఫిర్యాదు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు ఈసీకి కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. కేంద్రం, ఈసీ, జగన్ మధ్య లోపాయకారి ఒప్పందాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి ఈసీకి ఇబ్బంది ఏంటన్ని ప్రశ్నించారు. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించే వరకు చంద్రబాబు పోరాటం ఆగదని పేర్కొన్నారు.













