తిరుపతిలో వైసీపీ చేసిన ఆ తప్పే ఇబ్బంది పెడుతుందా…?
తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న కొన్ని కొన్ని సమస్యలు ఇప్పుడు అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా ఇబ్బందులు పడటం తో పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనే ప్రయత్నం చేయటం లేదు. పార్టీ అధిష్టానంతో వాళ్లకు సమస్యలు ఉన్న నేపథ్యంలో ఈ సమస్యల విషయంలో అధిష్టానం కూడా దృష్టి పెట్టకపోవడంతో ఇప్పుడు సమస్యల తీవ్రత పెరుగుతుంది అనే భావన ఉంది. అయితే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ మధ్య కాలంలో కొంతమంది విషయంలో కాస్త ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు అనే భావన కూడా ఉంది.
అయితే తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న వర్గ విభేదాలు విషయంలో వైసీపీ ముందు నుంచి కూడా దృష్టి పెట్టలేదు అనే భావన చాలా వరకు కూడా వ్యక్తమవుతోంది. 2019 లో గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ పార్టీలో సమర్థవంతంగా పని చేసినా సరే ఆయన సమస్యల విషయంలో అప్పుడు పెద్దగా దృష్టి పెట్టిన పరిస్థితి లేదు అని అందుకే రఘురామకృష్ణంరాజు తో పాటు ఆయన కూడా నడిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆయన బాటలో వెళ్లే అవకాశాలున్నాయని వార్తలు మీడియాలో కూడా వచ్చాయి.
కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గాని పార్టీ అధిష్టానం లో ఉన్న కొంతమంది కీలక వ్యక్తులు కానీ దీని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు అదే అధికార వైసీపీని తిరుపతి పార్లమెంటు పరిధిలో ఇబ్బంది పెడుతుంది అని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఇది బాగా కలిసివచ్చే అంశం అనేది కొంతమంది చెప్పే మాట. కొంతమంది మంత్రి పదవులు ఆశించిన వాళ్లకు ముఖ్యమంత్రి జగన్ హామీలు ఇచ్చారు. ఆర్ధికంగా కూడా పార్టీ కోసం ఎక్కువగా కష్ట పడిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ల విషయంలో పార్టీ అధిష్ఠానం దృష్టి పెట్టలేదు. దీంతోనే తిరుపతి పార్లమెంటు పరిధిలో కొన్ని సమస్యలు అధికార వైసీపీకి వస్తున్నాయని ప్రచారంలో పాల్గొనాల్సిన నేతలు కొంతమంది దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు. భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తున్నా సరే సున్నితంగా విమర్శలు చేసే పరిస్థితి ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. తిరుపతి పార్లమెంటు పరిధిలో ప్రచారం చేస్తున్న ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు గానీ అలాగే మంత్రులకు వాళ్ళ నుంచి సహకారం లేదు అని అంటున్నారు. దీనితోనే ఇప్పుడు అక్కడ పార్టీ ఇబ్బంది పడవచ్చు అని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. విజయం సాధించిన సరే అనుకున్న విధంగా మెజారిటీ రాకపోవచ్చు అనే భావన ఉంది.













