జగన్ వివరిస్తే జనం అర్ధం చేసుకుంటారా…?
ఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కొన్ని అంశాల్లో ముఖ్యమంత్రి జగన్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రజలకు అవసరం లేని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నది కాబట్టి కొన్ని రద్దు చేస్తే మంచిది.
ప్రజలకు వ్యాక్సిన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు 1600 కోట్లు వ్యాక్సిన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సిన అవసరం ఉంది. మే 1 నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఇక ఇప్పుడు మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాటిని రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉందని కొంతమంది కోరుతున్నారు. లేకపోతే ముఖ్యమంత్రి జగన్ ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఆర్థిక శాఖ ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఒత్తిడిలో ఉందని అంటున్నారు.
చాలా శాఖల నుంచి ఆదాయం తగ్గిందని సమాచారం. దేశంలో మరోసారి కఠిన ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. ఇది వ్యాపార రంగాన్ని పూర్తిగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు వాయిదా వేయాల్సిన అవసరం తో పాటుగా మరికొన్ని రద్దు చేయాల్సిన అవసరం కూడా ఉందని ప్రజలకు వాస్తవాలు వివరించగలిగితే ముఖ్యమంత్రి దాదాపుగా విజయం సాధించినట్లే అవుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు చేసి మరీ సంక్షేమ కార్యక్రమాలు అందించాల్సిన అవసరం అయితే దాదాపుగా లేదు.
ముఖ్యంగా వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చాలా వరకు వైద్య రంగం ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కొంతమంది సూచిస్తున్నారు. అందుకే ఆర్థికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు బలం చాలా అవసరం. అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా అభ్యంతరాలు పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అవకాశాలను వృధా చేసుకోకుండా జాగ్రత్తగా వెళితే మంచిది అని సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఈ అంశాలను టార్గెట్ గా చేసుకుని ప్రజల వద్దకు వెళుతుంది. జగన్ వాస్తవాలు చెప్పినా ప్రజలు అర్ధం చేసుకోలేకపోతే జగన్ పై ప్రజల్లో నమ్మకం లేనట్టే.













