తెలుగు రాష్ట్రాల్లో దీపావళి వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆనందోత్సాహాల మధ్య దీపావళి సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఇంటా వెలుగులు నింపే దీపావళి పండుగను సంతోషంగా జరుపుకున్నారు. మంగళవారం అమవాస్య రోజున దీపావళి జరుపుకోవాల్సి ఉన్నప్పటికీ సూర్యగ్రహణం కారణంగా సోమవారం లక్ష్మీ పూజలతో పాటు దీపావళి పండుగను నిర్వహించుకున్నారు. ఏ శుభకార్యమైనా జ్యోతి ప్రజ్వలనతోనే మొదలవుతుంది. దీప కాంతిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలుగా కొలుస్తారు. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి, దీపావళి జగత్నంతటినీ కాంతిమయం చేస్తుంది. ప్రతీ వ్యక్తి జీవితంలో దైవం ప్రాముఖ్యతను దీపావళి చాటుతుంది. ఇంటి ముంగిట, దేవాలయాల్లో మఠాల్లో, ప్రకారాల్లో గోశాల, వీధుల వెంబడి దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.













