TDP: వైసీపీ హయాంలో ఆ సినిమాకు నిధులు.. బాధ్యులపై చర్యలకు టీడీపీ డిమాండ్

గతంలో యాత్ర-2 సినిమా (Yatra-2 movie) కు రాష్ట్ర డిజిటల్ కార్పొరేషన్ నిధులు ఇవ్వడంపై శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipala Narendra) , కూన రవికుమార్ ప్రశ్నలు లేవనెత్తారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ సినిమాకు నిధులు ఇచ్చారని, విజిలెన్స్ విచారణలో ఆ విషయం వెల్లడైందని మంత్రి పార్థసారథి తెలిపారు. తదుపరి విచారణను సీఐడీ (CID) కి అప్పగించామన్నారు. ఈ వ్యవహారంలో తప్పు జరిగినట్లు నిర్ధరణ అయితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. డిజిటల్ కార్పొరేషన్ నిధులు రూ.50 కోట్ల మేర పక్కదారి పట్టించారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. నిబందనలు పాటించకుండా ఉద్యోగాలు కట్టబెట్టారని కూన రవికుమార్(Kuna Ravikumar) అన్నారు.