ఐఏఎస్‌ల సర్వీస్ రూల్స్ లో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఏపీ కేడర్ అఖిల భారత సర్వీసు అధికారుల వార్షిక నివేదిక ఆమోదానికి సంబంధించి ఆంధప్రదేశ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. వార్షిక పనితీరు నివేదికలు ఆమోదించే అధికారం సీఎంకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల నివేదికలు ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. అధికారు పనితీరు, ప్రవర్తన మదింపు చేసే అధికారం కూడా ముఖ్యమంత్రికి అప్పగించారు. మెరుగైన ఫలితాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎస్ అదిత్యనాథ్ దాస్ వెల్లడించారు. గవర్నర్ కార్యదర్శి పని తీరు నివేదిక గవర్నర్ ఆమోదిస్తారని ఆయన వెల్లడించారు. సీఎం ఆమోదించిన నివేదికల ఆదారంగానే బదిలీలు, పోస్టింగ్‌లు ఉంటాయని సీఎస్ వివరించారు. కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి అఖిలభారత సర్వీస్ అధికారులకు అవకాశం ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.













