జూద రాజధానిగా గుడివాడను అభివృద్ధి చేస్తున్నారా?
ముఖ్యమంత్రి సహకారంతోనే ఈ క్యాసినో జరిగిందా? జూద రాజధానిగా గుడివాడను అభివృద్ధి చేస్తున్నారా? అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని కన్వెన్షణ్ సెంటర్లో క్యాసినో నిర్వహించారనే ఆరోపణల నేపథ్యంలో ధూళిపాళ్ల మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బహిరంగంగా క్యాసినోలు నిర్వహిస్తే సీఎం జగన్ మౌనం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సీఎం, డీజీపీ మౌనం చూస్తుంటే అనుమానం కలుగుతోందన్నారు. ఇంత వరకు మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయలేదని నిలదీశారు. క్యాసినో నిర్వహించారని వీడియా బయట పెట్టారు. సీఎం స్పందననూ మీడియా సమావేశంలో ప్రదర్శించారు. క్యాసినో జరగలేదని మంత్రి కొడాలి నాని బుకాయించారు. నేను బయటపెట్టిన ఆధారాలపై మంత్రి సమాధానం చెప్పాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలు కోకొల్లలు. క్యాసినో నిర్వహణపై సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. మూడు రోజులు పోలీసులు ఆ వైపు చూడలేదన్నారు. దీనికి సీఎం సహకారం ఉందన్నది బహిరంగ సత్యం అని ఆరోపించారు.













