విశాఖలో ధర్మపోరాట సభ
కేంద్రంపై పోరాటంలో భాగంగా తెలగుదేశం పార్టీ విశాఖపట్నం వేదికగా చేయనున్న ధర్మపోరాట సభను ఈ నెల 22న నిర్వహించనున్నారు. తొలుత 20వ తేదీనే సభను ఏర్పాటు చేయాలని భావించినా, చివరకు 22న నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన పార్టీ నేతలు ఆయా కార్యక్రమాలపై చర్చించారు. ప్రతి జిల్లాలోనూ ధర్మపోట సభలతో పాటు, ఎక్కడిక్కడ ప్రజలను చైతన్యం చేసేందుకు సైకిల్ యాత్రలు చేపట్టాలని చంద్రబాబు నిర్దేశించారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని, బీజేపీ, వైసీపీ విపక్షాలు చేస్తున్న కుట్ర రాజకీయాలను వివరిస్తూ ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. నెల్లూరులో దళిత తేజం బహిరంగ సభను జూన్ మొదటివారంలో నిర్వహించాలని నిర్ణయించారు.













