ఆలయాల పరిరక్షణకు ప్రాధాన్యత: ఏపీ డిజీపీ
మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యహరించాలని ఆంధ్రప్రదేశ్ః డిజిపి గౌతమ్ సవాంగ్ పోలీసులకు సూచించారు. అంతర్వేది ఘటన అనంతరం పరిణామాలను పురస్కరించుకుని ఆయన ఆదివారం పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలోని ఆలయాల, ప్రార్ధనా మందిరాల పరిరక్షణకు కట్టుదిటమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అన్ని ఆలయాలను జియో ట్యాగింగ్ పరిధిలోకి తెస్తున్నామన్నారు. ఆలయాల పరిసరాలలో సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి దేవాలయం వద్ద పాయింట్ బుక్ ఉండాలని, స్థానికంగా పలువురిని అందులో భాగం పంచుకునేలా చేయాలన్నారు. మతపరమైన విద్వేషాలు రేకెత్తే అవకాశం ఉన్న చోట్ల మరిన్ని జాగ్రత్తలు చేపట్టాలన్నారు. వీటితో పాటు ఆలయాల, ప్రార్ధనా మందిరాల బందోబస్తుపై ఆయన పలు సూచనలు చేశారు.













