Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు

ఇంద్రకీలాద్రిపై దసరా (Dussehra) ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూల నక్షత్రం రోజు కావడంతో సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి సోమవారం భారీగాభక్తులు తరలివచ్చారు. సరస్వతీ (Saraswati) దేవి అలంకరణలో అమ్మవారి దర్శనానికి ఆదివారం రాత్రి నుంచే భక్తులను అనుమతించారు. దీంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. వినాయక గుడి (Vinayaka Temple) నుంచి సుమారు 2 కి.మీ మేర భక్తులు బారులుదీరారు.