హోదా ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలి
కేసీఆర్ నిజంగానే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోరే వ్యక్తి అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో ఏకగీవ్ర తీర్మానం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. పోలవరం నిర్మాణానికి సమకిస్తామని ఆయన చెప్పే మాటలు వాస్తవమైతే.. సుప్రీంకోర్టులో, ఇతర ట్రైబ్యునళ్లలో వేసిన కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం 9, 10 షెడ్యూల్లో ఉన్న ఆస్తుల విభజనకు సహకరించిన ఏపీకి దక్కాల్సిన రూ.లక్ష కోట్ల ఆస్తులను వెంటనే కేటాయించాలన్నారు. పట్టిసీమ పూర్తి చేసిన తనను ఎన్నికల్లో ఓడించాలనే లక్ష్యంతో మైలవరం వైకాపా అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మామ పారుపల్లి నాగేశ్వరరావు కేసీఆర్ దగ్గర నుంచి రూ.100 కోట్లు తెచ్చుకొని మైలవరం నియోజకవర్గంలో ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, జగన్లు కలిసి మంగళగిరికి రూ.200 కోట్లు పంపారన్నారు.













