ఆది పాదయాత్ర కాదు.. మార్నింగ్ ఈవినింగ్ వాక్
వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర పేరుతో మార్నింగ్, ఈవినింగ్ వాక్ చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు సీఎం రమేష్, బీటెక్ రవి చేపట్టిన నిరహార దీక్షా స్థలికి మంత్రి దేవినేని వచ్చారు. వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ పట్టిసీమ దండగ అని అడ్డుపడ్డ జగన్, గోదావరి జిల్లాల ప్రజలను రెచ్చగొట్టాలని చూశారని అన్నారు. కడప జిల్లాలో టీడీపీకి పూర్వ వైభవం రానుందన్నారు. జిల్లాకు గత ఏడాది 52 టీఎంసీల నీటీని తరలించామని చెప్పారు. పులివెందుల నియోజకవర్గానికి నీటిని ఇచ్చామని తెలిపారు. ఓదార్పు యాత్రలో మభ్యపెట్టాలని చూసినా, ప్రజలు సమ్మలేదన్నారు.













