దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబు పేరు చెబితే

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍కి సంబంధించిన వీడియోని మార్ఫింగ్ చేశారన్న ఆరోణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సీఐడీ విచారణకు హాజరయ్యారు. పదకొండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సీఐడీ అధికారు లు ఉమాను విచారించారు. దాదాపు తొమ్మిది గంటల పాటు సాగిన ఈ విచారణలో ఉమాపై సీఐడీ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో వినియోగించిన సెల్‍ఫోన్, ట్యాబ్ ఎక్కడిదని వాటిని తమకు అందజేయాలని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు.
సీఐడీ విచారణ ముగిసిన అనంతరం దేవినేని ఉమా సీఐడీ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వీడియో మార్ఫింగ్ చేసినట్లుగా చెప్పాలని, అలా అయితే వెంటనే లంచ్ టైమ్‍లోగా పంపించేస్తామని సీఐడీ అధికారులు చెప్పినట్లుగా ఉమా ఆరోపించారు. వీడియా చంద్రబాబే ప్లే చేయించారని చెప్పాలని అధికారులు ఒత్తిడి చేసినట్లుగా ఆరోపించారు. ఈ అక్రమ కేసులకు భయపడేది లేదని చట్టాన్ని ముఖ్యమంత్రి జగన్ చుట్టంగా చేసుకొని వినియోగించుకుంటున్నారన్నారు.