వీటిపై అబద్దాలు తప్ప ఏనాడైనా నిజాలు మాట్లాడావా సజ్జల ?
వైసీపీ పాలనలో డీబీటీ స్కీమ్ కింద రూ.వేల కోట్ల కుంభకోణం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో దేవినేని మీడియాతో మాట్లాడుతూ ఈ స్కీమ్ ద్వారా రూ.వేల కోట్లు వైసీపీ నాయకుల జేబుల్లోకి, తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లాయన్నారు. సంక్షేమ పథకాలు, కార్పొరేషన్ల కింద ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఉప ప్రణాళిక నిధులు రూ.14 వేల కోట్లు పక్కదారి పట్టించారు. గత ప్రభుత్వ హయాం నాటి 120 పథకాలు రద్దు చేశారు. 14 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు కొల్లగొట్టారు. విశాఖలో విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి, భూములు కబ్జా చేశారు. బీసీ రిజర్వేషన్లలో 10 శాతం కోత పెట్టారు. కృష్ణా జలాల్లో వాటాపై రాష్ట్ర హక్కులను కాలరాశారు. వీటిపై అబద్ధాలు తప్ప ఏనాడైనా నిజాలు మాట్లాడావా సజ్జలా? అని ప్రశ్నించారు.













