ట్విటర్ పిట్ట.. హోదాపై ఎందుకు స్పందించడం లేదు? : దేవినేని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై ప్రగల్భాలు పలికిన సీఎం జగన్ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదు అని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం మెడలు పంచుతామని ప్రగల్భాలు పలికారని సీబీఐ, ఈడీ కేసులకు సీఎం జగన్ భయపడి కేంద్రాన్ని ప్రశ్నించకుండా సాగిలపడ్డారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై జగన్ ఏనాడు కేంద్రాన్ని ప్రశ్నించలేదన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి లేఖ రాలేదని కేంద్రమంత్రే చెప్పారని అన్నారు. ఢల్లీిలో కూర్చొని కూతలు కూసే ట్విటర్ పిట్ట, హోదా అంశంపై ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకీ అన్యాయం జరిగినా సీఎం ప్రశ్నించడం లేదన్నారు. ఇరిగేషన్ మంత్రి ఫోన్ నెంబర్ తెలంగాణ పీఎస్ ఎఫ్ఐఆర్లో ఉంటే దీనిపై జగన్, సజ్జల ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. ప్రత్యేకహోదాపై టీడీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమన్నా జగన్ స్పందించలేని దుస్ఠితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు.













