భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి : దేవినేని
వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఈ సంద్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కేబినెట్లో ఉన్న మంత్రులందరూ ఓడిపోతారని తెలిపారు. ఆ పార్టీకి ఘోర పరాజయం తప్పదన్నారు. జగన్రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వైసీపీ కార్యకర్తలు, ప్రజలను మభ్యపెట్టేందుకు సజ్జల ప్రయత్నిస్తూ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. జగన్ లండన్ పారిపోతున్నారు. పెద్దిరెడ్డి పీఎల్ఆర్ కంపెనీ వాహనాలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని అన్నారు. వైసీపీ సోషల్ మీడియా దుకాణం సర్దుకుని సజ్జల భార్గవ్ హైదరాబాద్ వెళ్లిపోయాడని దుయ్యబట్టారు. భారీ మెజార్టీతో కూటమి అధికారంలోకి రావటం ఖాయమని స్పష్టం చేశారు. అరాచకాలకు కారకులైన జగన్ తాబేదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, జవహర్ రెడ్డి, రఘురామిరెడ్డి, అంజనేయులు లాంటి అధికారులు, నాయకులు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.













