స్వాతంత్య్ర ఉద్యమం తరవాత.. ఆ స్థాయిలో ఉద్యమం
స్వాతంత్య్ర ఉద్యమం తరవాత ఆ స్థాయిలో రాజధాని రైతులు ఉద్యమం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతి కోసం 808 రోజులుగా రాజధాని రైతులు చేసిన ఉద్యమాన్ని రాష్ట్రం మరచిపోదని అన్నారు. సీఆర్డీఏ చట్టం అమరావతి ప్రజా రాజధానిని కాపాడిరదని అన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే వెంటనే స్పందించాలన్నారు. ఈ రాష్ట్రానికి ఫైనాన్స్ గుమస్తా సీఎం కాకూడదన్నారు. పక్కరాష్ట్రం నుండి తెచ్చుకున్న లాలూచీ నిధులతో అమరావతిని చంపారని మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేయడం చేతకాదు అందుకే చతికిల పడ్డారన్నారు. రైతు చట్టాలపై ప్రధాని దేశానికి క్షమాపణ చెప్పారని, ఈ సీఎం ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. లాఠీలతో కొట్టిన పోలీసులకు అన్నం పెట్టిన చేతులు రైతులవని అన్నారు. ఇక బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని రైతులు ముందుకు వెళ్ళాలని అన్నారు.













