అప్పుడు వైఎస్… ఇప్పుడు జగన్
పోలవరంలో పునాదే పడలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్న చోటు నుంచి మొన్న లక్షలాది క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లిందేని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పుడు వైఎస్, ఇప్పుడు జగన్ పోలవరం టెండర్లను నిలిపివేశారని విమర్శించారు. 2009లో పోలవరం స్పిల్ వే పనులను అప్పటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలిపివేయించారని ఆరోపించారు. గతంలో టెండర్ల రద్దు వల్ల రూ.2,500 కోట్ల నష్టం వచ్చిందన్నారు. జగన్ తన అనుచరులకు విద్యుత్ ప్రాజెక్టు ఇప్పించేందుకే.. పోలవరం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం అహంకారంతో వ్యవహరించిందని అన్నారు. హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టని దేవినేని వ్యాఖ్యానించారు.













