దేవీనేని ఉమా కీలక నిర్ణయం.. ఈ నెల 25 నుంచి
మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని ప్రభుత్వం వెంటనే రోడ్లను బాగుచేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 25 నుంచి దేవినేని పాదయాత్ర చేపట్టనున్నారు. దుగ్గిరాలపాడు నుంచి జి.కొండూరు వరకు ఉమా పాదయాత్ర కొనసాగనుంది. ప్రభుత్వం రహదారుల మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్ర చేస్తున్నారు. అధ్వాన్నంగా మారిన దుగ్గిరాలపాడు`జి.కొండూరు రోడ్డు మరమ్మతుపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. రోడ్లు మరమ్మతు చేయకపోవడంపై ఏడు గ్రామపంచాయతీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా రోడ్లు బాగుచేయాలని డిమాండ్ చేశారు.













