మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్ మంజూరు
ఆంధప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావుకు బెయిల్ వచ్చింది. హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాలు పలు సెక్షన్ల కింద దేవినేనిపై కేసులు పెట్టి అరెస్ట్ అయిన విషయం విదితమే. ఈ కేసులో ఉమకు ఆంధప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దేవినేని ఉమపై జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి సుమారు వారం రోజులపాటు ఆయన్ను జైల్లోనే ఉంచారు. కొండూరులో అక్రమ మైనింగ్ బహిర్గతం చేసే సమయంలో దేవినేనిపై వైసీపీ నేతలు దాడికి ప్పాలడ్డారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దృష్టికి ఉమ తరపు న్యాయవాది తెలిపారు.













