రివర్స్ టెండరింగ్‌తో రివర్స్ పాలన : దేవినేని
వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు ఆగిపోయాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని అన్నారు. పక్క రాష్ట్రానికి మేలు చేయడానికే పనులు ఆపేశారని ఆరోపించారు. ప్రభుత్వం పోలవరంపై చర్చ చేపట్టకుండా పోరిపోయిందన్నారు. పోలవరంపై ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయనే చర్చించలేదన్నారు. రివర్స్ టెండరింగ్ తో రివర్స్ పాలనకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందన్నారు. పోలవరానికి బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అవార్డు ఇచ్చారన్నారు. కాంక్రీట్ పనుల విషయంలో పోలవరం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిందని అన్నారు.
చంద్రబాబుపై కక్షతోనే పోలవరం సహా వివిధ ప్రాజెక్టు పనులు ఆపేశారని అన్నారు. సిమెంట్ కంటే ఇసుక బస్తా ధర ఎక్కువ ఉండటం జగన్ అసమర్థతేనని అన్నారు. ఇసుకను వైకాపా నేతలు ఏ విధంగా లూటీ చేస్తున్నారో జగన్ గ్రహించాలని హితవు పలికారు.













