చంద్రబాబును కాదు..పెట్టుబడుల్నీ పంపేశారు
విశాఖలో బలవంతంగా విమానం ఎక్కించి టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కరినే పంపలేదని, ఎన్నో పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని రాష్ట్రం నుంచి తరిమేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. పౌరసరఫరాల శాఖ ద్వారా కొడాలి నాని రైతులకు చెల్లించాల్సిన రూ.1900 కోట్లు బకాయిలు మాత్రమే చూపిస్తున్నారని, వాస్తవంగా చెల్లించాల్సింది రూ.3వేల కోట్ల పైమాటేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుని తిట్టడం తప్ప మంత్రి కొడాలి నానికి ధాన్యం రైతుల సమస్యలు పట్టవా? అని నిలదీశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ తమ్మినేని జిల్లా శ్రీకాకుళంలో రూ.501 కోట్లు బకాయిలు ఉన్నాయని గుర్తు చేశారు. స్పీకర్ స్థానంలో ఉండి చంద్రబాబుని విమర్శించే తమ్మినేనికి జిల్లా రైతు సమస్యలు పట్టావా అని ఆయన ప్రశ్నించారు.













