వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు : దేవినేని
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. మద్దిపాడు మండలం గుండ్లకమ్మ జలాశయాన్ని మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌తో కలిసి దేవినేని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ గేటు మరమ్మతులు చేయడంలో అధికార పార్టీ విఫలమైందని అన్నారు. జలాశయం గేటు విరిగిపోయి 8నెలలు గడుస్తోందన్నారు. నెల రోజుల్లో మరమ్మతులు చేయిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్నో హామీలు ఇస్తున్నారు గానీ, రాష్ట్రానికి అప్లులే మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పినా ఇప్పటికీ ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు. ప్రజా ధనాన్ని సొమ్ము చేసుకుంటూ రాష్ట్రానికి అప్పులు మిగుల్చుతున్నారు. గేట్ల మరమ్మతులు చేయడానికి వచ్చిన గుత్తేదారులకు నిధులు రాకపోవడంతో వదిలేసి పోవడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామంటున్న ముఖ్యమంత్రి జగన్ ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారు? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు గుండ్లకమ్మ నుంచి నీరు విడుదల చేయలేదు. ఖరీప్‌లో గుండ్లకమ్మ నుంచి రైతులకు నీరందించేందుకు ఎలాంటి మాయమాటలు చెబుతారో వేచి చూడాలి. సీఎం జగన్ చెబుతున్న మాటలు ప్రజలు గమనిస్తున్నారు అని అన్నారు.













