ఏ2 కు శాసనమండలిలో ఏం పని? : దేవినేని
సీబీఐ, ఈడీ కేసులు పర్యవేక్షించుకునేందుకే శుక్రవారం ఏపీ అసెంబ్లీకి సెలవిచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు విమర్శించారు. ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డికి శాసనమండలిలో ఏం పని? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేస్తామన్నారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు ఉండాల్సింది జైల్లోనే అని అన్నారు. సీఎం జగన్ ఎంత ప్రయత్నించినా మండలి రద్దు కాదన్నారు. మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం చేస్తే కోర్టుకెళ్తామని సృష్టం చేశారు. సీఎం జగన్ కోర్టుకు హాజరుకావడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.30 కోట్ల భారం పడుతుందన్నారు. మీడియా ప్రతినిధులపై నిర్భయ, దిశ కేసులు నమోదు చేస్తారా? మీడియా గొంతు నొక్కేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.













