జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలి : దేవినేని
సజ్జల వ్యాఖ్యలపై ఈసీ తక్షణమే స్పందించి అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమ డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిబంధనలు పాటించేవాళ్లు ఏజెంట్లుగా సజ్జలకు అవసరం లేదట. టీడీపీ, జనసేన ఏజెంట్లకు అడ్డుపడాలని ఆయన హితబోధ చేయడం సిగ్గుచేటు. ఓటమి భయంతో కౌంటింగ్ రోజు రాష్ట్రంలో అలజడుల సృష్టికి వైసీపీ కుట్ర చేస్తోంది. సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి డైరెక్షన్లోనే సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సీఎస్ పదవికే మచ్చ తెచ్చిన జవహర్‌రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలి అని డిమాండ్ చేశారు.













