గుడివాడ టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ ?
కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను పోటీ చేయించే అంశాన్ని తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తోంది. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి కొడాలి నాని తెలుగుదేశం అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ స్థానాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్న టీడీపీ అవినాష్‌ను బరిలోకి దింపి వ్యూహాత్మక ప్రయోగం చేయాలని భావిస్తోంది. త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు. పార్టీ వ్వవస్థాపక అధ్యక్షుడు, దివంగత నేత ఎన్టీఆర్ 1983, 85 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి సుమారు 50 వేల మెజారిటీతో గెలుపొందారు.













