Kandula Durgesh: అఖండ గోదావరి ప్రాజెక్టును అభివృద్ధి చేస్తాం : మంత్రి దుర్గేశ్
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసేందుకు ఈ నెల 26న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) వస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ.94.44 కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని వెల్లడిరచారు. రాజమండ్రి హేవ్ లాక్ వంతెనను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలోనే పుష్కర ఘాట్లను, కడియం నర్సరీలను అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఎంపీ పురందేశ్వరి (MP Purandeshwari) పాల్గొంటారని తెలిపారు.













