ఆలయాల అభివృద్ధి.. భక్తుల సౌకర్యమే మా ప్రబుత్య ధ్యేయం : దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవాలయాలను అభివృద్ధిపరచడంతోపాటు, స్వామివారికి నిత్య నైవేద్య కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడటంతోపాటు, భక్తులకు అవసరమైన వసతి సౌకర్యాల కల్పనకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర దేవాదాయశాఖ కృషి చేస్తోందని ఆశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ‘తెలుగు టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు.
దేవాదాయశాఖ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త పథకాలు ఏమిటి?
తమ ఇష్టదైవాన్ని దర్శించుకోలేని భక్తులకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ ఎన్నో చర్యలను చేపట్టింది. అందులో ముఖ్యమైనది ఆన్లైన్ పూజలు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలతోపాటు ఇతర దేవాలయాల్లో ఆన్లైన్ ద్వారా భక్తులు భగవం తునికి సేవ చేసే అవకాశాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ కల్పించింది. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు వివిధ ఆలయాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇ`దర్శన్, ఇ`హుండీ, పోస్టల్ ద్వారా ప్రసాదాల పంపిణీ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. విదేశాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్న భక్తులు రాష్ట్రంలోని తమ ఇష్ట దైవాలను కొలుచుకునేందుకు, దర్శించి, పూజా కార్యక్రమాలను చేసుకునేందుకు ఆన్లైన్ ద్వారా ముందుకు వస్తున్నారు. ఇష్ట దైవాల పూజల్లో ఆన్లైన్ ద్వారా పాల్గొంటున్నారు. వివిధ ఆలయాల్లో ఈ-పూజలను బుక్ చేసుకున్న భక్తులకు గోత్రనామాలతో కోరుకున్న పూజను ఆలయంలో నిర్వహించేలా దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుడు పూజను బుక్ చేసుకున్న వెంటనే అతడి మొబైల్ నంబర్‌కు ప్రత్యేకంగా ఓ ఆన్లైన్ లింకును ఆలయ అధికారులు పంపుతారు. నిర్దేశిత సమయంలో అధికారులిచ్చిన కోడ్‌తో భక్తుడు ఆన్లైన్లో లింకు ఓపెన్ చేయగానే.. సంబంధిత భక్తులు పూజను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. పూజల తరువాత ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా పంపిస్తారు.
వివిధ ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు నిత్యం నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమాలను దేవాదాయ శాఖ ఆన్లైన్లో పరిధిలోకి తెచ్చింది. శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయంలో అభిషేకం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, చంఢీ హోమం, నిత్య కల్యాణ పూజలను పరోక్ష సేవల కేటగిరిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్నవరం ఆలయంలో మఖ నక్షత్రం రోజున అభిషేకంతోపాటు అన్ని రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆన్లైన్ ద్వారా జరిపించుకోవచ్చు. ద్వారకా తిరుమలలో శ్రీవారి నిత్య కల్యాణం, బెజవాడ కనకదుర్గ ఆలయంలో చండీహోమం, ఖడ్గమాలార్చన, శ్రీకాళహస్తిలో రాహు`కేతు పూజలను ఆన్లైన్ విధానంలో నిర్వహించుకోవచ్చు. ఇలా పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలను ఆన్లైన్లో జరిపిం చుకునే విధంగా రాష్ట్ర దేవాదాయశాఖ ఏర్పాట్లు చేసింది.
ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ పథకం కింద కొన్ని పెద్ద దేవాలయాలలో భక్తుల విరాళాలతో జరుగుతున్న పనులు…
* అమెరికాలో ఉంటున్న శ్రీనివాస్ గుత్తికొండ, రవి ఐకలు ఇచ్చిన 10కోట్ల రూపాయల విరాళంతో కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక దేవాలయం పునర్నిర్మాణం చేసుకుని మహా కుంభాభిషేక మహోత్సవాలు జరుపుకుంది.
* విజయవాడ లోని జివిఎస్ ప్రాజెక్ట్ ప్రై. లిమిటెడ్ వారు 150 లక్షల రూపాయల విరాళంతో ద్వారక తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆకాశ రాజ అతిధిగృహం నిర్మిస్తున్నారు.
* బాపట్ల జిల్లాలో కావూరు గ్రామం లో వున్న శ్రీ రామ లింగేశ్వర స్వామి గుడిలో 120 లక్షల రూపాయల వ్యయంతో గుడి పునర్నిర్మాణ పనులను చేసేందుకు కెవి బాలప్రసాద్, తుమ్మల రామ కృష్ణ అనే ఇద్దరు భక్తులు ముందుకు వచ్చారు.
* జంగారెడ్డిగూడెంలో వున్న శ్రీ పారిజాత గిరి వేంకటేశ్వర స్వామి గుడి గోపురం పునర్నిర్మాణం పనులు 150 లక్షల రూపాయలు భక్తుల విరాళాలతో పూర్తి అవుతోంది.
* అలాగే శ్రీశైలంలో యాగ శాల నిర్మాణానికి కావ లసిన సుమారు 3 కోట్ల రూపాయలను హైదరా బాద్ వాస్తవ్యులు శారద పర్వతయ్య ఇచ్చారు.
విదేశాల్లో హిందూ దేవాలయాలు… రాష్ట్ర సహకారం
విదేశాల్లో హిందూ దేవాలయాలు…రాష్ట్ర సహకారం పేరుతో మరో కార్యక్రమాన్ని ఎన్నారైలకోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విదేశాల్లో ఉన్న ఎన్నారైలు తాము నివసిస్తున్న ప్రాంతాల్లో ఆలయాల ఏర్పాటుకు, పూజలు, ఇతర సేవలకోసం రాష్ట్ర దేవాదాయశాఖ సహకారాన్ని కోరవచ్చు. వారికి అవసరమైన సహాయసహకారాలను అందించడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మీ ప్రాంతంలో… మీరు కోరుకున్నచోట ఆగమశాస్త్రాల ప్రకారం దేవాలయాల ఏర్పాటు, తరువాత నిర్వహించే కార్యక్రమాలకు అవసరమైన మద్దతు, సహకారాన్ని ఎపి ప్రభుత్వం అందిస్తుంది.
ఆలయాల్లో ప్రతిష్ఠించనున్న ధ్వజస్తంభం, విగ్రహాల ఏర్పాటులో కూడా సూచనలు ఇవ్వడంతోపాటు ఆయా విగ్రహాలు, ధ్వజస్తంభం నిర్మించే తయారీకేంద్రాలను చూపించడం, అవసరమైతే వాటిని విదేశాలకు పంపించడంలో కూడా సహాయపడుతుంది. దాంతోపాటు విదేశాల్లో ఉన్న ఆలయాల్లో పూజల నిర్వహణకు అవసరమైన పండితుల నియామకాల్లో కూడా సహకరిస్తుంది. ఆలయ పూజా కైంకర్య విషయాల్లో సీనియర్ పూజారుల ద్వారా శిక్షణను కూడా ఇప్పిస్తుంది.
ధార్మిక పరిషత్ గురించి చెప్పండి?
దేవాదాయశాఖలో ధార్మిక పరిషత్ నిర్ణయాలే కీలకమైనందున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 21 మందితో ధార్మిక పరిషత్‌ని ఏర్పాటు చేశాము. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి చైర్మన్ గాను, దేవాదాయ శాఖ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా, రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు మరో 18 మంది సభ్యులుగా ఈ ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేశాము.
సేంద్రియ పదార్థాలతో ప్రసాదాల తయారీని వివరించండి?
రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాల్లో పురుగుమందుల ఆనవాళ్లు లేని ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని భక్తులకు అందించాలన్న ఉద్దేశ్యంతో సేంద్రియ పద్ధతిలో పండిరచే రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలు కొనుగోలు చేయాలని నిర్ణయించాము. ప్రసాదాలు, అన్నదానంలో ఉపయోగించే 12 రకాల ఆహార ధాన్యాలను సేంద్రీయ పద్ధతిలో సాగు చేసిన రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నాము.
శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, పెనుగంచిప్రోలు, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, వాడపల్లి, విశాఖ కనకమహాలక్ష్మీ ఆలయం, మహానంది ఆలయాల్లో ముందుగా ఈ విధానాన్ని ప్రవేశ పెడుతున్నాము. ఈ ఆలయాల్లో ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలకు ఏటా దాదాపు 8 వేల టన్నుల ఆహార ధాన్యాలు అవసరం ఉంటుందని అంచనా. రెండు దశలో చేపట్టే 175 ఆలయాలకు 35 ` 40 వేల టన్నుల ఆహార ధాన్యాల అవసరం ఉంటుంది. సాధారణ పురుగు మందులు ఉపయోగించి పండిరచే ఆహార ధాన్యాలకు బదులు సేంద్రియ పద్ధతిలో పండిరచిన ధాన్యం వినియోగం ద్వారా భక్తులకు మరింత నాణ్యమైన ప్రసాదం అందించవచ్చన్న ఉద్దేశ్యంతో ఈ మార్పులు తీసుకువచ్చాము.
ఆలయాల్లో ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తున్నారా?
ప్లాస్టిక్ కవర్లు పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నందున ఇక నుంచి దేవాలయాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతోపాటు ప్లాస్టిక్ కవర్లలో పూజా సామగ్రిని ఆలయాల్లోకి అనుమతించబోము. అలాగే ఆలయానికి అనుబంధంగా ఉండే దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలపై నిషేధం విధిస్తున్నాము. ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్న ప్లాస్టిక్ సంచుల వినియోగానికి స్వస్తిపలికాము. ఇప్పటికే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసి అమలు చేస్తున్నాము.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అమలు జరుగుతున్న తరహాలోనే ప్రధాన దేవాలయాల్లో శుభ్రమైన మంచినీటి సరఫరాకు చర్యలు చేపట్టాము. మంచినీటి సరఫరా పాయింట్ల వద్ద స్టీల్ గ్లాస్‌లను అందుబాటులో ఉంచుతున్నాము. అలాగే భక్తులు ఇంటి నుంచి మంచినీరు తెచ్చుకున్నా గాజు సీసాలు లేదంటే స్టీల్ బాటిళ్లలో తెచ్చుకునేలా విస్తృత ప్రచారం చేస్తున్నాము.
దేవాదాయశాఖ భూముల ఆక్రమణలపై మీరు తీసుకున్న చర్యలేంటి?
రాష్ట్రంలో చాలాచోట్ల రాష్ట్ర దేవాదాయశాఖకు చెందిన భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ ఆక్రమణలకు సంబంధించి ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో వేలాది కేసులు ఎప్పటినుంచో అపరిష్కృతంగా ఉన్నాయి. అందులో కొన్ని కేసులు పరిష్కారమయ్యాయి. కొన్నిచోట్ల దేవాదాయ శాఖ సిబ్బంది ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకున్నప్పటికీ, మరికొన్నిచోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలాంటి చోట్ల ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు వీలుగా ఎనిమిది మంది అమీన్లను ప్రత్యేకంగా దేవాదాయ శాఖకు కేటాయించేందుకు హైకోర్టును కోరాలని నిర్ణయించాము. ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో పెండిరగ్లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నాము.
ఆలయాల్లో నిత్యనైవేద్య కార్యక్రమాలను ఏ విధంగా చేస్తున్నారు?
అతి తక్కువ ఆదాయం ఉండే ఆలయాలలో స్వామివారికి నిత్యం నైవేద్య కార్యక్రమాలు నిర్వహించడంలో ఇబ్బందులను గమనించి, ధూప దీప నైవేద్య పథకం (డీడీఎన్ఎస్) ద్వారా పలు ఆలయాలకు నిధులను ఇస్తున్నాము. నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దేవాలయాలకు పరిమితి లేకుండా సంతృప్త స్థాయిలో డీడీఎన్‌ఎస్‌ను అమలుచేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశాలకనుగుణంగా అర్హత ఉన్న ప్రతి గ్రామంలో కనీసం ఒక దేవాలయాన్ని అయినా ఈ పథకం కిందకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ఈ పథకం ద్వారా ఇప్పటికే దాదాపుగా 3,500కు పైగా ఆలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నాము. మరిన్ని ఆలయాలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు కృషి జరుగుతోంది.
ఈ-హుండీ
భక్తులు ఆన్లైన్ ద్వారా తమ ఇళ్లలోనే ఉండి లేదా ప్రపంచంలో ఎక్కడ నుండి అయినా తమతమ ఇష్టదైవాలకు మొక్కుబడులు చెల్లించుకునే అవకాశం కల్పించడంకోసం, రాష్ట్రంలోని అన్నీ ఆలయాల్లో దశలవారీగా ఈ-హుండీ విధానాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ ప్రవేశపెట్టింది. ఈ`హుండీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు తమ మొక్కుబడులను తమ ఇష్టదైవానికి సదరు దేవస్థానంలో నేరుగా సమర్పించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ`హుండీ నిమిత్తమై అన్నీ దేవాలయాలు యూనియన్ బ్యాంక్, నణఖీజ పaఅస, IజIజI పaఅస, Aఞఱం దీaఅసలతో ఒప్పందం కుదుర్చకున్నారు. ఈహుండీ ద్వారా చెల్లింపులు చేయాలనుకునే భక్తులు రాష్ట్ర దేవాదాయశాఖ వెబ్సైట్లోకి వెళ్ళి చేయవచ్చు.
ఇ-డొనేషన్
ఇ-డొనేషన్ విధానం ద్వారా ఆలయాల్లో జరిగే అన్నదానం, గోసేవ, వైద్యం, వేదపాఠశాల, ఆగమ పాఠశాల, క్షేత్ర అభివృద్ధి మొదలైన ఎన్నో బృహత్తరమైన పనులకు నిర్ణీత విరాళాన్ని సమర్పించవచ్చు.
పరోక్షసేవ
మరో సేవను కూడా రాష్ట్ర దేవాదాయశాఖ ప్రవేశపెట్టింది. అదే పరోక్షసేవ. ఆలయాలకు రాలేని సుదూర ప్రాంతాల్లోని, విదేశాల్లో ఉన్న భక్తులకు కూడా ఆ సేవాభాగ్యాన్ని కల్పించా లనే ఉద్దేశంతో ఈ ‘పరోక్షసేవ’కు రూపకల్పన జరిగింది. ఈ పరోక్షసేవ ద్వారా భక్తులు తాము కోరుకున్న తేదిన, నిర్ణీత రుసుమును చెల్లించి ఎంచుకున్న ఆర్జితసేవను వారి గోత్రనామాల మీదుగా ఆయా ఆలయాల్లో జరిపించుకోవచ్చు. ఆర్జితసేవ చేసిన భక్తులకు ప్రసాదాన్ని భారతదేశంలోని మీ చిరునామాకు పోస్ట్ ద్వారా అందుకోవచ్చు.
మా ఊరు-మా గుడి
సమాజ సంక్షేమానికి, సంరక్షణకోసం కట్టిన, ఏర్పడిన ఎన్నో దేవాలయాలు చాలా చోట్ల మరమ్మతులు చేయలేని విధంగా శిథిలావస్థలో ఉంటున్నాయి. అలాంటి దేవాలయాలను పునరుద్ధరించుకునేందుకు, ఆయా ఆలయాల్లో ఉన్న దేవునికి నిత్యపూజలు జరిగేలా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మా ఊరు-మా గుడి’ పేరుతో ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా విదేశాల్లో ఉన్న ఎన్నారైలు తమ ఊర్లలోని దేవాలయాలను సంరక్షించుకోవ డానికి ముందుకు వస్తే వారికి తగిన సహకారాన్ని, సహాయాన్ని దేవాదాయశాఖ అందిస్తుంది. తాము పుట్టి పెరిగిన ఊర్లలో ఉన్న ఆలయాల సంరక్షణకు ఎన్నారైలు ముందుకు వచ్చి విరాళం ఇవ్వడం లేదా ఆయా ఆలయాల నిర్వహణ బాధ్యతలను ఓ సంస్థగా, లేక వ్యక్తిగతంగా, కుటుంబం పేరుతో నిర్వహించడానికి ముందుకు వస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. అలాగే విరాళం ఇచ్చినవారు ఊరిలో ఉన్న గుడిని సంరక్షించుకోవడానికి తమ తరపున ఎవరినైనా నియమించుకోవచ్చు. ఆలయ పునరుద్ధరణకు, ఆలయ పూజాకైంకర్యాలను విరాళాలు ఇచ్చే ఎన్నారైలకు పన్ను రాయితీలు కూడా లభిస్తాయి. పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చినవారు సూచించిన పేర్లను ఆ గుడులలో పెడుతారు. అలాగే ఆలయ నిర్వహణలో కూడా వారు పాలుపంచుకోవచ్చు.













