సేవారంగంతోనే అభివృద్ధి, ఆదాయం
సర్వీసు సెక్టర్మీద దృష్టి పెట్టండి
పండుగలా ‘జన్మభూమి-మాఊరు’
ప్రభుత్వ విజయాలపై విస్తృత ప్రచారం
రేషన్ దుకాణ సేవలు మెరుగుపర్చాలి
కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, డిసెంబర్ 29: సుస్థిర అభివృద్ధి సేవా రంగం నుంచి మాత్రమే సాధ్యమని, సేవారంగం మీద దృష్టి కేంద్రీకరిస్తే అద్భుత ఫలితాలు వస్తాయని, అందువల్ల సేవారంగంమీద దృష్టి కేంద్రీకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. శనివారం ఉండవల్లి ప్రజావేదిక సమావేశమందిరంలో కలెక్టర్ల సదస్సును ప్రారంభించారు. సేవారంగంలో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ ఆదాయం సాధ్యమవుతుందన్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ దిశగా పనిచేయాలని ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపుణేఠాను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తే అక్కడ సందర్శకులు బసచేయడానికి సరిపడా గదులు లేవని గుర్తు చేశారు. రానున్న కాలంలో సేవారంగంలో లక్ష గదులు అందుబాటులోకి తేవాలని పర్యాటక శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. పర్యాటకంగా అభివృద్ధి చెందితే మన రాష్ట్రానికి తిరుగు ఉండదని, వృద్ధిలో దూసుకుపోతామని అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలలో వృద్ధి కనిపిస్తున్నదని, అయితే సేవారంగంలో ఇంకా శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. గ్రామ జిల్లా స్థాయిలలో ప్రణాళికల రూపకల్పనకు సమాయత్తం కావాలని ఆదేశించారు. సాధించిన అభివృద్ధిని, సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాలను బేరీజు వేసుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేయడానికి శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నామని, ఇంకా వచ్చే 3 రోజులలో శ్వేత పత్రాలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. నిర్ణీత లక్ష్యాల సాధనకు సానుకూల దృక్పధం కలిగి ఉండాలన్నారు.
పండుగలా ఆరో విడత జన్మభూమి-మా ఊరు
ఆరో విడత ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమాన్ని గ్రామగ్రామానా, ప్రతి వార్డులో పండగ వాతావరణంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఇప్పుడు విడుదల చేసిన 7, విడుదల చేయనున్న 2 శ్వేతపత్రాలపై జనవరి 2 నుంచి నిర్వహించే జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పెద్దఎత్తున చర్చ జరగాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పది రోజులలో గ్రామీణ ప్రజానీకానికి ప్రభుత్వం సాధించిన విజయాలపై అవగాహన కల్పించాలన్నారు.
గ్రామస్థాయి సూక్ష్మ ప్రణాళికలను వెల్లడించడానికి ఈ సభలే వేదికలుగా నిలుస్తాయని, జన్మభూమి-మా ఊరు కార్యక్రమం తర్వాత విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామని అన్నారు. పెట్టబడి లేని ప్రకృతి సేద్యంపై రైతాంగంలో మరింత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. జన్మభూమి గ్రామ సభలలో పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం అవగాహన కల్పించాలన్నారు.
మన కష్టానికి గుర్తింపే అవార్డులు, కలెక్టర్ల మేధోమధనంతో మంచి ఫలితాలు
జిల్లా స్థాయి సమస్యల పరిష్కారాలకు కలెక్టర్ల సమావేశం దిక్సూచిగా నిలుస్తోందంని ముఖ్యమంత్రి చెప్పారు. కలెక్టర్ల సమావేశాలు మేధో మధనానికి ఉపకరిస్తున్నాయని, ఫలితాల సాధనలో ఈ సమావేశాల ప్రాధాన్యత చాలా వుందని, కలెక్టర్లంతా విజయాన్ని ఆస్వాదిస్తున్నారని, అభివృద్ధి ప్రత్యక్షంగా కనపడుతోందని ప్రభుత్వ శాఖలు సాధించిన
635 పురస్కారాలే ఇందుకు నిదర్శనమని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన 635 అవార్డులు మన అద్భుత పనితీరుకు, సామర్ధ్యానికి గీటురాయి అని చంద్రబాబు అన్నారు. ‘చేసిన పనిని ఎవరూ గుర్తించలేకపోవడం అంటూ ఉండదు. కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది. నిరంతరం పనిలోనే నిమగ్నం అవుతున్నామని, పనిలో ఉంటే వేరే ఆలోచనలు కూడా రావని, మన పనితీరుకు ఈ అవార్డులే రుజువని సీఎం వివరించారు. విభజన సమయంలో ఎదురైన సమస్యలు వెంటాడుతూ వస్తున్నాయి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కష్టాలు ఎలా ఉంటాయో వివరిస్తూ సమయం కూడా ఇవ్వకుండా హైకోర్టు విభజన చేశారని, వచ్చే ఉద్యోగులు సంసిద్ధంగా లేకుండానే హడావుడిగా విభజన చేశారని చెప్పారు. అయినా మనం సిద్ధంగానే ఉన్నామన్నారు. కోర్టులు కూడా వస్తున్నాయని, సరిపడా విమానయాన సర్వీసులు లేవని, వెంటనే విమానయాన సదుపాయాలు కల్పించాలని అందరూ కోరుతున్నారని సీఎం చెప్పారు. కాంక్రీట్ విభాగంలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెక్రటేరియెట్ ర్యాఫ్ట్ పనులకు రెండు రోజుల క్రితం శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎయిర్ షో పర్మిషన్ రద్దు అత్యంత దుర్మార్గం
ఎయిర్‌షో చివరి నిమిషంలో విత్ డ్రా చేశారంటే కేంద్రం ఎంత కక్షగా వ్యవహరిస్తున్నదో అర్ధం అవుతోందని ముఖమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఎయిర్ షో కు ముందుగా అనుమతించి చివరిలో ఎందుకు అనుమతి రద్దు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. సింది
పోలవరం ఒక రియాలిటీ
కేంద్రం డబ్బులు సకాలంలో ఇస్తే పోలవరం ప్రాజెక్టును మరింత వేగంగా నిర్మించవచ్చని, ఎట్టి పరిస్థితులలో 2019లో పోలవరం ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా నీళ్లు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
కొద్ది నీటితోనే అనంత’ అద్భుతాలు













