Raghurama: సుపరిపాలనలో తొలి అడుగులో ఎమ్మెల్యేలకు అవమానం: రఘురామ
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు అవమానం జరిగిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (Raghuramakrishnam Raju) అన్నారు. కలెక్టర్ (Collector) కంటే ఎమ్మెల్యే (MLA) ప్రొటోకాల్ పెద్దదని చెప్పారు. కలెక్టర్, ఎస్పీ(SP) , ఎంపీ (MP) ని ఒక టేబుల్ వద్ద కూర్చోబెట్టారు. మరో టేబుల్ వద్ద కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిపి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టారు. ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్ నిబంధనలు పాటించలేదు. ప్రభుత్వ కార్యక్రమానికి స్పీకర్ (Speaker) , డిప్యూటీ స్పీకర్ను కూడా ఆహ్వానించాలి. ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి ( సీఎస్)కి లేఖ రాస్తా. ఇది మొదటి తప్పుగా భావిస్తున్నా. కార్యక్రమానికి వెళ్లి ఉంటే సీటింగ్ విధానం చూసి బయటకు వచ్చేసేవాడిని. అనమానం జరిగిందని చాలా మంది ఎమ్మెల్యేలు నాతో చెప్పినందునే మాట్లాడుతున్నా. ప్రొటోకాల్ ఉల్లంఘన ప్రభుత్వ పెద్దలకు తెలిసి జరిగిందో, లేదో నాకు తెలియదు అని అన్నారు.













