ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు : పవన్ కల్యాణ్
రాష్ట్ర భవిష్యత్తు, ఏపీ పునర్నిర్మాణం కోసం జనసేన పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఎందరో మహానుభావులు తెలుగునేలపై జన్మించారని, వారందరి స్ఫూర్తితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనతో రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతోపాటు పోలవరం, అమరావతి ఆగిపోయాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయి. సహజ వనరులు దోపిడీకి గురయ్యాయి. పెట్టుబడులు కూడా రాకుండా చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడి ఆధ్వర్యంలో కలిసి పనిచేస్తాం. ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలి. తప్పు చేస్తే జనసేన వారిపైనా చర్యలు ఉంటాయి. నేను తప్పు చేసినా చర్యలు తీసుకోవాలని అనా అన్నారు.













